అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేత బోండా ఉమ సమావేశమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ
వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే... ఈ నేపథ్యంలో ఉమ, చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో భాగంగా చంద్రబాబు దూతగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆయన్ను కలిశారు.
సమావేశం అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడుతూ... బోండా ఉమ టీడీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అబద్దాలేనని కొట్టిపారేశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకె ఆయనతో భేటీ అయ్యానని చెప్పారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు పార్టీ నుంచి బయటకు వెళ్లే వారిపై చర్చించామని స్పష్టం చేశారు. అవసరమైతే విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానని, ఆయన్ను స్వీకరించాల్సిందిగా కోరానని వెంకన్న చెప్పారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉమ వెన్నంటి నిలిచారని వెంకన్న కొనియాడారు.