హైదరాబాద్: బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో
మాట్లాడుతూ... వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సెట్లు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోన్న బీజేపీకి అంత సీన్ లేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చీకటి రాజకీయాలు చేస్తూ.. కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. లోపాయికారిగా మద్దతు ఇచ్చుకునే పార్టీలు ప్రత్యర్థులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. బీజేపీ-టీఆర్ఎస్ నాటకాలు ప్రజలను మోసం చేయడానికేనన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదని... ఎమ్యెల్యేగా ఓడిపోయిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎగిసిపడుతున్నారని ఎద్దేవ చేశారు. ఉత్తమ్ కుమార్ ను విమర్శించే స్థాయి లక్ష్మణ్‌కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.