Print
Hits: 935

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలో...ప్రజల తరపున ఎలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గళం వినిపించాలో, సభకు హాజరుకాని ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకోవాలో

వంటి విషయాలపై మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా జగన్ అండ్ కోకు క్లాస్ పీకారు. నిజానికి చంద్రబాబు ఈ క్లాస్ తీసుకునే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో లేకపోవడం వేరే సంగతి. కానీ తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ఉద్దేశించి, నీతులు బోధించారు. అసెంబ్లీ అనగానేమి, శాసనసభలో మాట్లాడే తీరు, అధికార పార్టీ పట్ల ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలి, క్రమం తప్పకుండా సభకు ఎలా హాజరవ్వాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఇంకా రికార్డుల్లోనే ఉన్నాయి. కానీ ప్రతిపక్షంలో ఇతరులు ఉంటే ఈ నియమాలను ఫాలో అవ్వాలి కానీ తన వంటి 40 ఏళ్ల అనుబవం ఉన్న సీనియర్లకు ఇవ్వనీ వర్తించవని చంద్రబాబు ధృడంగా నమ్ముతారు. అందుకే జగన్ కు చెప్పిన నీతి వాక్యాలను చంద్రబాబు ఒక్కటి కూడాఫాలో అవడం లేదు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన నియమాలను ప్రస్తుతం ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎంత వరకు ఫాలో అవుతున్నారని టీడీపీ నేతలను అడిగితే వారివద్ద కూడా సమాధానం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుబవం ఉన్న నేతకు ఆ మాత్రం మినహాయింపు ఇవ్వకపోతే ఎలా అని తెలుగుతమ్ముళ్లు వితండ వాదం చేస్తారేమో. అలా అనుకుంటే కనీసం ఇప్పటికైనా చంద్రబాబు ఇతరులకు నీతులు చెప్పడం మానుకోవడం మేలు. లేని పక్షంలో గతాన్ని తోడి, బాబు బండారాన్ని బయటపెట్టడానికి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు...ఓవైపు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే, తనకేమీ పట్టనట్లు ఫారిన్ టూర్ కి చెక్కేశారు. గతంలో జగనే వైఖరిని తప్పుబట్టిన చంద్రబాబు..ఇలా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విదేశాలకు వెళ్లడం ఏరకంగా సమర్ధనీయమో తెలుగుతమ్ముళ్లే వివరణనివ్వాలి. కాపు రిజర్వేషన్లతో పాటూ ఎన్నో కీలక అంశాలపై ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కానీ చంద్రబాబు ఎస్కేప్ అయిపోయారు. దీనికి ప్రదాన కారణం... గతంలో చంద్రబాబు చేసిన తప్పులపై అధికార వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నిలదీయడంతో దానికి సమాధానం చెప్పలేక గత రెండువారాలుగా బాబుగారు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఆయనకు దిక్కుతోచని పరిస్ధితిలో టీడీపీ అధినేత డిఫెన్స్ లో పడిపోయారు. ఇక చంద్రబాబును ఏదో రకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు సీఎం జగన్ తో పాటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు అంతరాయం కలిగిస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. కానీ అచ్చెన్నాయుడుపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆయన సభకు దూరంగా ఉండటంతో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడేవారు కరువయ్యారు. టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్, కరణం బలరాం, గంటా శ్రీనివాస్ వంటి సీనియర్లు కూడా వైసీపీ ధాటిని తట్టుకోలేక మౌనంగా ఉండి పోతున్నారు. దీంతో అసెంబ్లీలో తాను ఏకాకిగా పోరాడం కంటే, ఫారిన్ ట్రిప్ కు వెళ్లి హ్యాపీగా ఎంజాయా చేయడం మేలని బాబుగారు డిసైడ్ అయినట్లున్నారు. మరి గతంలో చంద్రాబాబు చెప్పిన విదంగా ప్రతిపక్షంలో ఉంటూ అసెంబ్లీ డుమ్మా కొట్టిన కారణంగా టీడీపీ అధినేతకు జీతం ఇవ్వకుండా ఆపేయాలా? అంటే దీనికి చంద్రబాబు వద్ద కూడా సమాధానం దొరకదు.  

e-max.it: your social media marketing partner