అమరావతి: 40 ఏళ్ల అనుభవం చేయలేని పని 40 ఏళ్ల సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రభుత్వం కఠిన
నిర్ణయాలతో బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు నిజంగానే బీసీల అభివృద్ధిని కోరుకుంటే.. బిసి బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. మద్యపాన వ్యతిరేక బిల్లు, భూయజమానుల హక్కు బిల్లులపై మీ వైఖరి ఏంటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెడుతోన్న బిల్లులపై చర్చలో పాల్గొనకుండా సభ నుంచి వాకౌట్ చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ చంద్రబాబు అండ్ కో పై నిప్పులు చెరిగారు.