జమ్మూ-కశ్మీర్: జమ్మూ కశ్మీర్‌కు వేల సంఖ్యలో అదనపు పోలీసు బలగాలను పంపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా
ముఫ్తీ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ‘‘కశ్మీర్ లోయలో మరో 10 వేల అదనపు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ భద్రతా బలగాలకు ఇప్పుడు ఏమీ కొదువలేదు. జమ్మూ-కశ్మీర్ అనేది రాజకీయ సమస్య. దీనికి సైనిక చర్యలతో పరిష్కారం దొరకదు. భారత ప్రభుత్వం పునరాలోచించి తన విధానం మార్చుకోవాలి.’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.