అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రైతులకు పెట్టుబడి సాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా
మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరగా... వారికి అవకాశం కల్పించలేదు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రైతు సమస్యలపై మాట్లాడాలంటే ప్రభుత్వం పారిపోయిందంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.