అమరావతి: తనను కావాలనే సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం ఆయన మీడియాతో
మాట్లాడుతూ... అధికార పార్టీ నాయకులు సమర్పించిన వీడియోలను చూపించిన డిప్యూటీ స్పీకర్, తాము తీసుకొచ్చిన వాటిని కూడా చూపించాలని చెప్పామన్నారు. ఇరు పక్షాల వీడియోలు చూసిన తరువాత ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని చెబితే దానిని కూడా వినలేదని వాపోయాడు.
వారి ఏకైక ధ్యేయం బలహీనవర్గానికి చెందిన తాను ఉప నాయకుడిగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరణపై ప్రశ్నిస్తున్నందునే సస్పెండ్ చేశారన్నారు. తన స్థానం నుంచి తాను కదల్లేదని, అసభ్యంగా మాట్లాడలేదని అలాంటి తనను ఎందుకు సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు నిలదీశాడు.