హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు త్వరలో బీజేపీలో చేరనున్నారని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు
ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణాలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. కేసీఆర్ ను గద్దె దింపడం ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సీనియర్ నేతలు కవిత, వినోద్ ఓటమి పలవడంతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆయన జోస్యం చెప్పారు. సీనియర్ నేత డీఎస్‌తో పాటు చాలామంది నేతలు కాశ్య కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలనం రేపారు. కాగా... కేసీఆర్ పాలనలో తెలంగాణలో రెవెన్యూశాఖతో పాటు అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని దత్తాత్రేయ విమర్శలు గుప్పించారు.