తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏం చేశారు? గాడిదలను కాశారా అని నిలదీశారు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తప్పు పట్టారు. పొరుగు రాష్ట్రం గోదావరి జలాలను వాడుకుంటుంటే ఏపీ సీఎం ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కేసీఆర్ చుట్టూ చర్చ సాగింది. మన వాటా కోసం కొట్లాడాల్సింది పోయి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లడమేంటని విపక్ష నేత చంద్రబాబు తప్పు పట్టారు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం జగన్... చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కడుతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. తాను వెళ్లినా, వెళ్లకపోయినా కాళేశ్వరం స్విచ్ ఆన్ చేస్తారని చెప్పారు. ఏపీ హక్కులను కాపాడుకుంటూనే ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలన్నది తన ప్రభుత్వ విధానమని చెప్పారు.