ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనతో దద్దరిల్లిపోయింది. గోదావరి జలాలపై టీడీపీ అడిగిన ప్రశ్నకు జవాబు
సందర్భంగా తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తప్పు పట్టారు. పొరుగు రాష్ట్రం గోదావరి జలాలను వాడుకుంటుంటే ఏపీ సీఎం ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కేసీఆర్ చుట్టూ చర్చ సాగింది.