కడప: రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించబోతోందని ఆపార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. ఈరోజు కడపలో నిర్వహించిన
విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటోందని తెలిపాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం బాగుందని, దీన్ని బట్టి చూస్తే ఏపీలో ప్రధానపార్టీగా బీజేపీ అవతరిస్తుందని తెలుస్తోందని అన్నారు. అలాగే 2024లో వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్నామని కన్నా వ్యాఖ్యానించారు.