rebellion against chandrababu
  • టీడీపీని వెంటాడుతున్నఆగస్ట్ టెన్షన్
  • చంద్రబాబుపై తిరుగుబాటుకు ఆగస్టులో ముహూర్తం?

 తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెలకు అవినాభావ సంబంధం ఉంది. అన్న ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి, టీడీపీలో సంక్షోభం సృష్టించి, ఆయనను గద్దె దించేందుకు రెండు సార్లు జరిగిన ప్రయత్నాలు కూడా

ఆగస్టు నెలలోనే. అన్నగారితో ఆగస్టు సెంటిమెంట్ అటకెక్కిందని తెలుగు తమ్ముళ్లు భావించారు కానీ... దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఆగస్టు సంక్షోభ భయం టీడీపీ హైకమాండ్ ను వణికిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నప్పటికీ ఈ సంక్షోభానికి ఆగస్టు నెలలో ముహూర్తం ఖరారయ్యిందన్న వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సీన్ ను సేమ్ టు సేమ్ రిపీట్ చేసే విధంగా బీజేపీ పెద్దలు స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. ఆగస్టు సంక్షోభం సృష్టించడంలో అనుభవమున్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును కూడా బీజేపీలో చేర్చుకోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, తనవైపు తిప్పుకుని, ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసిన విధంగానే టీడీపీలోని మెజారిటీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి, చంద్రబాబునాయుడు నుంచి టీడీపీని లాక్కునేందుకు వ్యూహ రచన జరుగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎక్కడలేని పెద్దరికాన్ని ఆపాదించుకునేందుకు తాపత్రయపడే చంద్రబాబు సీనియారిటీకి అసలు సవాల్ ఇప్పుడు ఎదురుకాబోతోంది. చంద్రబాబు ప్రత్యర్ధులతో పాటూ ఎన్టీఆర్ అభిమానులంతా ఆ తరుణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వయోభారానికి తోడు ఓటమి భారం వెంటాడుతున్న ఈ గడ్డు పరిస్ధితుల్లో తిరుగుబాటు రాజకీయాన్ని తిప్పికొట్టే చేవ చంద్రబాబులో ఉందా అంటే.. దీనికి తెలుగు తమ్ముళ్లు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు.

 

అన్న ఎన్టీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే.. ఆయన బలహీనతను అడ్డంపెట్టుకుని, తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబునాయుడు ఆగస్టు నెలలో ముహూర్తం పెట్టారు. ఎందుకంటే ఎన్టీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఆగస్టులోనే సంక్షోభం సృష్టించారు. అందుకే ఆగస్టులో సంక్షోభంపై స్కెచ్ వేస్తే, మంచి ఫలితముంటుందని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అనుకున్న ప్రకారమే ఆగస్టు నెలలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి. పక్కా ప్లాన్ తో ఆయనను గద్దె దించేశారు. మెజారిటీ బలాన్ని అడ్డంపెట్టుకుని, తాను ఏం చేసినా చెల్లుతుందన్న రీతిలో అప్పట్లో చంద్రబాబు వైఖరి కనిపించింది. సరిగ్గా 24 ఏళ్లు తిరిగే సరికి మళ్లీ ఆగస్టు నెలలోనే తనకు కూడా తిరుగుబాటు గండం పొంచి ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు ఊహించలేకపోయారు. ఇప్పడు చంద్రబాబును గద్దె దించే ఛాన్స్ లేకపోయినా, టీడీపీ నుంచి చంద్రబాబును వెలివేసే విధంగా మాస్టర్ ప్లాన్ ను ఢిల్లీలో రచిస్తున్నట్లు సమాచారం. దీనికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన చంద్రబాబు కోటరీగా నిన్నటి వరకు భావించిన సుజనాచౌదరి, సీఎం.రమేష్, గరికపాటి వంటి కొందరు నేతల సూచనలను ఫాలో అవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నేతృత్వంలో 13 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆగస్టు వరకు వేచి ఉండాల్సిందిగా బీజేపీ పెద్దలు సూచించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు పకడ్బందీగా ఈ ప్లాన్ ను అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారినప్పుడు కొంత అలజడి కనిపించినా, తర్వాత అది సద్దుమణిగిపోవడంతో ఇక టీడీపీని ఎవరూ ఏం చేయలేరనే నారా అండ్ కో తెగ బిల్డప్ లు ఇస్తోంది. జింకను వేటాడే ముందు పులి ఎంతో సైలెంట్ గా ఉంటుంది, అలాంటిది పులినే వేటాడాలంటే ఇంకెంత సైలెంట్ గా ఉండాలి. ఇక్కడ పులితో చంద్రబాబును పోల్చడం కొంత అతిశయోక్తి అయినా టీడీపీ నేతలు పులి అంటూ బాబుకు భజన చేస్తారు కాబట్టి అలా పోల్చాల్చి వస్తుంది. ఈ పోలిక విషయాన్ని పక్కన పెడితే బీజేపీ హైకమాండ్ ఎంత సైలెంట్ గా ఉంటే అక్కడి నుంచి ఇచ్చే షాక్ అంత వైలెంట్ గా ఉంటుంది. ఈ విషయం చంద్రబాబుకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. అందుకే జగన్ పై ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎన్నికల ముందు పొద్దున లేచింది మొదలు బీజేపీ మీద, మోడీ మీద దుమ్మెత్తి పోసిన చంద్రబాబు ఇప్పడు ఆ పౌరుషాన్ని ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారో, రాయలసీమ రక్తం ఎందుకు ఉడుకెత్తడం లేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేస్తే సీన్ సితార్ అవుతుంది ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు బాగా అర్ధమైనట్లుంది. అందుకే మోడీతో ఢీకొనే డేంజర్ గేమ్ లు ఆడకుండా... జగన్ ను విమర్శిస్తూ ఇండోర్ గేమ్స్ కే బాబు పరిమితమైపోయారు. ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినని చందంగా బాబు అకౌంట్ సెటిల్ చేయాలని మైండ్ లో ఫిక్స్ అవడంతో ఇక బ్లైండ్ గా ముందుకు వెళ్లాలని మోడీ, షా ద్వయం డిసైడ్ అయిపోయింది. మరి ఈ స్కెచ్ ను ఆగస్టు లో అమలు చేస్తే.. చంద్రబాబుకు ఎలాంటి చుక్కలు కనిపించబోతున్నాయో అన్న ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతోంది. అయితే ఈ ప్లాన్ ను అమలు చేసేందుకు, చంద్రబాబును ధీటుగా ఎదుర్కొని పార్టీని గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు సమర్ధుడైన నేత కోసం అమిత్ షా ఆన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేశారని, వారిలో సరైన నేతను బరిలోకి దింపి, బాబు అకౌంట్ సెటిల్ చేసి, టీడీపీ పగ్గాలు ఆ నేతకు అప్పగిస్తారని తెలుస్తోంది.  

 

జాతక రీత్యా కూడా చంద్రబాబుకు ఈ ఆగస్టు నెల నుంచి గడ్డుకాలం మొదలవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంతకాలం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న గ్రహాలు ఆగస్టు నుంచి దశలు మారడంతో  ప్రతికూల ఫలితాలు ఇవ్వొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. కాలం కలిసొస్తే కింగ్, కథ అడ్డం తిరిగితే షేకింగ్ అన్న చందంగా ఇంతకాలం టైం కలిసి రావడంతో చంద్రబాబు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోయింది. ఇప్పుడు ఈ చంద్రుడికి ఆగస్టులో గ్రహణం పట్టబోతోందని జాతకాలు చెబుతున్నాయి. మరి గ్రహణం వీడేసరికి బాబుగారి పరిస్ధితి ఎలా ఉండబోతోందనే సస్పెన్స్ టీడీపీ నేతలను వెంటాడుతోంది. ప్రతీ మనిషికీ మహర్దశ అనేది జాతకంలో ఉంటుంది. ఆ దశ దాటిపోయిన తర్వాత కొంత కాలం గడ్డు పరిస్ధితిని ఎదుర్కోవడం పరిపాటి. చంద్రబాబు జాతకంలో కూడా చాలా ఉన్నత స్ధాయిని చూశాక, పదేళ్ల పాటూ ప్రతిపక్షంలో ఏటికి ఎదురీదాల్సి వచ్చింది. మళ్లీ ఆయనకు రాజయోగం వచ్చింది కానీ ఇప్పడు ఆ యోగ దశ పూర్తవడంతో ఈసారి మరింత సవాళ్లు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. చంద్రబాబు వేసినవ్నీ తప్పటడుగులు మిగలడంతో పాటూ... శత్రువులంతా ఏకమై చంద్రబాబుకు సినిమా చూపించడానికి సిద్ధమయ్యారంటే ఆయన టైం ఎంత బ్యాడ్ గా నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని చెప్పి, వర్తమాన పరిస్ధితుల్ని ఆకళింపు చేసుకునే సాదా, సీదా రాజకీయ నేతల తత్వం చంద్రబాబుది కాదు. ఓడినా నాదే పైచేయి అంటూ వితండ వాదం చేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నా అధికార దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటున్న చంద్రబాబు ఆగస్టు సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారో... కమలనాధులు వేసే గూగ్లీలను ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాలి.

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...