విజయవాడ: అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారంపై సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ... విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు తన ఫేస్ బుక్ వేదికగా సంచలన
వ్యాఖ్యలు చేశారు. "గౌరవ ముఖ్యమంత్రి గారు.. నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై - డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా? లేకపోతే మన రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా! .. కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు" అని కేశినేని తన ఫేస్బుక్లో రాసుకొచ్చారు.