హైదరాబాద్: మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే టీపీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. టీపీసీసీ అధ్యక్ష పదవిపై
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీపీసీసీ పదవి బీసీ సామాజిక వర్గానికి చేందిన వారికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే... పార్టీలో తన కంటే సీనియర్.. పార్టీకి విధేయుడు ఎవరున్నారని వీహెచ్ ప్రశ్నించారు. జులై మొదటి వారంలో పార్టీ విధేయులతో తాను సమావేశం ఏర్పాటుచేస్తానని వీహెచ్ స్పష్టం చేశారు. ఓ వైపు టీపీసీసీ చీఫ్ మార్పు ఉండదని కుంతియా చెబుతుంటే... జగ్గారెడ్డి తనకు పదవి ఇవ్వాలని ఎలా అడుగుతున్నారని వీహెచ్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వచ్చి వాలె... పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దంటే ఇచ్చారని, నాడు పార్టీ పేరుతో గెలిచిన వారు ఇప్పుడు పార్టీ మారుతున్నారని వీహెచ్ మండిపడ్డారు.