Print
Hits: 894
vangaveeti to meet pawan kalyan

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. అయితే... పవన్ కల్యాణ్‌తో వంగవీటి అరగంట పాటు చర్చలు

జరపడంతో వారిరువురి భేటీ రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. వంగవీటి జనసేన పార్టీలో చేరేందుకే పవన్‌తో మంతనాలు జరిపారని, దీంతో ఆయన త్వరలోనే జనసేనలో చేరబోతున్నారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కాగా... ఎన్నికలకు ముందు జగన్‌ను విభేదించిన వంగవీటి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎన్నికల సమయంలో చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కాంక్షిస్తూ... మూడు రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. చంద్రబాబు మల్లి సీఎం అయితే... ఏదో ఒక పదవి వస్తుందని వంగవీటి ఆశపడ్డాడు. అయితే.. సంచలన రీతిలో వైసీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. దీంతో ఆయన ఈరోజు జనసేనానితో భేటీ అవడం చర్చనీయాంశమయ్యింది.

e-max.it: your social media marketing partner