Print
Hits: 934

గుంటూరు: టీడీపీ నుంచి నలుగురు వెళ్తే.. 40వేల మంది నాయకులు తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి 

ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా). నలుగురు ఎంపీలు పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంతో అలర్ట్ అయిన టీడీపీ, పార్టీలోని తాజా పరిణామాలపై చర్చించేందుకు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలపాటి మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ ఈ నలుగురు ఎన్నికల్లో పోటీచేసే ధైర్యంలేని వ్యక్తులని, పార్టీ వీడినందుకు వారికి రాష్ట్ర ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఎన్నో సంక్షోభాలను చూసిన టీడీపీకి ప్రస్తుత పరిస్థితులు లెక్క కాదన్నారు. పార్టీ మారిన ఆ నలుగురు ఎంపీలకు ప్రజాదరణ లేకపోయినా పార్టీకి అంకితభావంతో ఉన్నారనే పదవులు ఇచ్చినట్లు స్పష్టంచేశారు. కాగా... వారు పార్టీ మారడంతో పాటు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ)ని బీజేపీలో విలీనం చేశామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు... పార్టీ మారిన ఎంపీలు టీడీపీ కోవర్టులని.. చంద్రబాబే వారిని పంపారని జరుగుతోన్న ప్రచారాన్ని ఆలపాటి కొట్టిపడేశారు. టీడీపీకి అంత ఖర్మ పట్టలేదన్నారు.

e-max.it: your social media marketing partner