అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు,
అలాగే... నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఈరోజు సాయంత్రం పార్టీ ఎమ్మెల్సీలతో, రేపు ఎంపీలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం గురించి చర్చించనున్నట్లు సమాచారం. అలాగే... ఈ నెల 15న జరగనున్న టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులతో బాబు భేటీ కానున్నారు.