అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ పై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. ఆముదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచిన తమ్మినేని సీతారాంను
స్పీకర్ గ నియమిస్తున్నట్లు సమాచారం. కాగా.. స్పీకర్‌గా అంబటి రాంబాబు, ఆనం రాంనారాయణరెడ్డి, కోన రఘుపతితో పాటు రోజా పేర్లు ప్రచారంలో ఉండగా... వారిలో కొందరు స్పీకర్ పదవికి నిరాకరించారని తెలుస్తోంది. దీంతో తమ్మినేని సీతారాం పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.