హైదరాబాద్: పరిషద్ పోరులో కారు జోరు చూపిస్తోంది. ఈరోజు వెలువడుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ
దుమ్మురేపుతోంది. రాష్ట్రంలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా... మధ్యాహ్నం రెండు గంటల వరకు వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో 2000కు పైగా స్థానాల్లో విజయం టీఆర్ఎస్ విజయం సాధించి.. మరింత స్పీడుగా దూసుకెళ్తోంది. కొన్ని మండలాల్లో అయితే... ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా... అన్ని స్థానాలను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ 700 స్థానాల్లో విజయం దక్కించుకోగా... బీజేపీ 150కు పైగా స్థానాల్లో... సీపీఎం, సీపీఐ, స్వతంత్రులు 350కి పైగా స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు, ఇప్పటి వరకు వెల్లడైన జెడ్పీటీసీ ఫలితాల్లో దాదాపు 12 జెడ్పీటీసీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది.