అమరావతి: ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా ఎంపికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను
పార్లమెంటరీ పక్ష నేతగా నియమించారు. ఇక లోక్‌సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనాచౌదరి వ్యవహరించనున్నారు. ఈరోజూ ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమావేశం అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.