ఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై విశ్లేశించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమయ్యింది. ఈ సమావేశంలో
కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే రాహుల్ రాజీనామాను పార్టీ నేతలు తిరస్కిన్చే అవకాశాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు గలాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, మధ్య ప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులు హాజరయ్యారు.