Print
Hits: 1008

విజయవాడ: ఓట్ల కోసం, ఎన్నికల ముందు... పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూస్తే వళ్ళంతా ఉప్పూ-కారం పూసి బుద్ధి చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబుకు

చురకలంటించారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. "ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు విజయంతంగా సమాధి చేశాడు. ఎన్టీఆర్ విధానాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తో జతకట్టి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేశారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల కుప్పగా మార్చాడు. నీపార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు చంద్రబాబూ." అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.

"కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, అబద్ధాలు, యూ-టర్నులు, వేల కోట్ల పంపిణీలు ప్రజలను ఏమాత్రం ఏమార్చలేక పోయాయి. పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూస్తే వళ్ళంతా ఉప్పూ-కారం పూసి బుద్ధి చెప్పారు. నీ అంత దిగజారిన నీచుడు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించడు చంద్రబాబూ" అంటూ వరుస ట్వీట్లు చేస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

e-max.it: your social media marketing partner