అమరావతి: ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఖాతా తెరిచింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోన్న వైసీపీ ఇప్పటి వరకు నాలుగు
అసెంబ్లీ స్థానాల్లో విజయం నమోదు చేసింది. వైసీపీ చింతలపూడి అభ్యర్థి ఎలిజ, విజయనగరం అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి, పార్వతి పురంలో జోగారావు, కడపలో అంజాద్ బాషా విజయపు గంట మోగించారు.