కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతోంది. గత
ఎన్నికల్లో (2014) మొత్తం 42 సీట్లలో దీదీ పార్టీ 36 స్థానాలతో భారీ విజయ సాధించగా... ఈసారి 22 స్థానాల్లోనే ముందంజలో కొనసాగుతోంది. ఇక 2014 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న బీజేపీ, ఏకంగా 16 స్థానాల్లో తన ప్రాబల్యాన్ని బలపరుచుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ... టీఎంసీ పార్టీ సీట్లకు భారీ గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.