మాక్ పోలింగ్ లో నమోదైన ఓట్లను తొలగించడం మరిచిపోయి అధికారులు అసలు ఓట్లకే
ఎసరు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనను రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి సీరియస్ గా తీసుకుని, విచారణకు ఆదేశించారు. ఈ తప్పిదంతో ఐదుగురు ప్రిసైడింగ్ అధికారులతో పాటు మరో 15 మంది పోలింగ్ సిబ్బందిపై వేటేసేందుకు రంగం సిద్ధమైంది.
కాగా...ఆదివారం జరిగిన తుది దశ పోలింగ్ లో మాక్ పోలింగ్ ఓట్లు డిలీట్ చేయడం మరిచిపోయిన అధికారులు తర్వాత నాలిక్కరుచుకున్నారు. అయితే సాధారణ ఓట్లతో సరిపోలేలా మాక్ పోలింగ్ ఓట్లను డిలీట్ చేసే పనిలో పడ్డారు. మాక్ పోలింగ్ ఓట్లను డిలీట్ చేయబోయి...కొన్ని ఓట్లను తొలగించేశారు.