సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బిజేపి నేత నాగం జనార్థన్ రెడ్డి. కేసిఆర్ తక్షణమే కరువు మండలాలను ప్రకంటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పంట ఇన్సూరెన్సు కోసం మూడు వందల కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించినా నష్టపరిహారం ప్రకంటించకపోవడం సీఎం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
కేసీఆర్ మాటల గారడీ ఇక చెల్లదని విమర్శించారు. బచావ్ తెలంగాణ మిషన్ పేరుతో ఈనెల 21 నుంచి పూర్తికాని ప్రాజెక్టులను ఇంజనీర్ల బృందంతో కలిసి పరిశీలిస్తామని నాగం వెల్లడించారు. కేసీఆర్ కేబినెట్ లోని మంత్రులంతా ఉత్సవ విగ్రహాలని నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను ఇంకా ఆరు నెలలు శక్తి ప్రసాదించమని సీఎం కోరడం శోచనీయమన్నారాయన. మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తల కోసం రూపొందించిదని ఆరోపించారు.