ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల్లో ఉండే వారికి ఇలాంటి పరామర్శ యాత్రలు చాలా అవసరం.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అయినా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అయినా పరామర్శలకు వెళ్లినప్పుడు ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించడం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంల కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా పరామర్శ యాత్రకు వస్తున్నాడు. ఇప్పటికే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఒక యాత్రను చేపట్టిన రాహుల్ రెండో విడత యాత్రను తెలంగాణలో నిర్వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య నిధుల గురించి చర్చ జరుగుతోంది. రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి డబ్బులను విరాళాల రూపంలో సేకరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ముందుగా వీ హనుమంతరావు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించగా.. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మరో లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఇతర నేతల కూడా ఇలాంటి విరాళాలతో రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రాఆలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు.
రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో ఆయా కుటుంబాలకు ఈ నేతలు ఈ డబ్బును ఆర్థిక సాయంగా అందించనున్నారు. మరి ఢిల్లీ నుంచి రాబోయే రాహుల్ గాంధీ రైతుల కోసం ఆ మాత్రం డబ్బులు చేతబట్టుకోకుండానే వస్తున్నాడా?!
మరి సల్మాన్ కు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడినా.. అతడు ఉన్నట్టుండి జైలుకు వెళితే మాత్రం బాలీవుడ్ లో కొంతమంది బుడ్డీలు ఆరిపోతాయని తెలుస్తోంది. మొత్తంగా సల్మాన్ పై ఇప్పుడు వెయ్యి కోట్లరూపాయల మార్కెట్ ఆధారపడి ఉంది. మేకింగ్ దశలో ఉన్న అతడి సినిమాలు.. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టులు.. చాలా వరకూ పూర్తయ్యి.. కొంత పెండింగ్ లో ఉన్న సినిమాలు... ఇవన్నీ కూడా నష్టపోవడం ఖాయం!
సల్మాన్ ఉన్నఫలంగా జైలు కు వెళితే ఆయనపైఏ ఇన్వెస్ట్ చేసిన వారందరిదీ దిక్కుతోచని పరిస్థితే అవుతుంది. ఓవరాల్ గా ఇలాంటి వారందరి పెట్టుబడులను.. ఆశిస్తున్న లాభాలను లెక్కవేసి చూస్తే... బాలీవుడ్ కు వెయ్యి కోట్ల రూపాయల లాసు అని గణాంకాలు చెబుతున్నాయి. మరి సల్మాన్ స్థాయి ఏమిటో. .అతడి మీద ఎంత మార్కెట్ ఆధారపడి ఉందో ఈ గణాంకాలతో క్లారిటీ వస్తుంది!