వలసలు...! పుట్టి పెరిగిన ఊరిలో ఉపాధి కరువైంది. పొలం ఉన్న బోరు బావుల్లో నీరు లేదు..! పంటకాలువలు వస్తాయన్న మాట తాతల కాలం నుంచి నినుడేకానీ...కాలువలు వచ్చింది లేదు..! చూసింది లేదు..! ఇక చెరువుల కింద భూములున్నోళ్లకు పారేది కూడా తక్కువే..! ఉన్నవి రెండే దారులు..! ఒకటి పట్నం వలస పోవాలి...లేదా గల్ఫ్ కు వలస కార్మికుడిగా వెళ్లాలి..! ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల గోస కాదు..! దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వలసలు కనిపిస్తున్నాయ్.

 

బ్రతుకు దెరువు కోసం ప్రజలందరూ పట్నం బాట పడుతున్నారు. మారుమూల మురికివాడల్లో కాసింత ఉండేందుకు ఇంత చోటులో బ్రతులకు వెళ్లదీస్తున్నారు. అడ్డ మీద కూలీలు అవుతున్నారు. కాసింత నైపుణ్యం ఉన్నల్లో ఫ్యాక్టరీల్లో కార్మికులు అవుతున్నారు. ప్రాణం చేతగానోళ్లు సెక్యూరిటీగార్డులుగా వాచ్ మెన్ లుగా  సెటిల్ అవుతున్నారు.

ఈ వలసలకు తోడు బంగ్లాదేశీయుల అక్రమ వలసలు...! ఇప్పుడున్నది వలస భారతం..! బ్రతుకు దెరువు కోసం వలస వస్తున్న ఈ భూమి పుత్రులకు మురికివాడలే దిక్కు.! మరి మన నగరాలు ఈ వలసలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయా అంటే అది కూడా లేదు..! ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పినట్లుగా మన దేశంలో పట్టణాల విస్తరణను ఇప్పటి వరకు పాలకులు కాకుండా రియల్ఎస్టేట్ డెవలపర్లే నిర్దేశించారనేది కఠోర సత్యం...! ఏదో అరకోర లే అవూట్ల కే  ఓకే చెప్పి...మన పురపాకల సంఘాలు చేతులు దులుపుకుంటున్నాయ్. ప్రక్కా ప్రణాళిక బద్ధంగా నగరాల విస్తరణ జరగడం లేదన్నది వాస్తావం. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణాల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరా, విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలను మన పాలకులు...ఇటు బ్యూరోకాట్లు పట్టించుకోలేదు...ఫలితం దేశంలో నగరాలు అంటే మురికి కూపాలుగా మారాయ్. 

ఇక మన తెలుగు రాష్ట్రాల నగరాలు, పట్టణాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామంటున్నారు. నిధులు కూడా భారీగా కేటాయిస్తున్నారు. అయితే ఏం లాభం  గంటల కొద్ది ట్రాఫిక్ జాములు...! ఉద్యోగస్థులు ఆఫీసులకు వెళ్లాలంటే గంట ముందు నుంచే ఇంటి నుంచి బయలు దేరాల్సిన దుస్థితి. అయినా కూడా సమయానికి తమ గమ్యస్థానాలకు చెరుకుంటారనే గ్యారెంటీ లేదు. ఇక చినుకు పడితే చాలు.... హైదరాబాద్ లోని మెయిన్ రోడ్డులు చెరువులను ..నదులను తలపిస్తాయ్. గ్రేటర్ లో సెంటిమీటర్ వర్షం పడిందంటే చాలూ...వాహనదారులకు నరకమే..!

తెలంగాణలోని మరో నగరం వరంగల్ కార్పొరేషన్...ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో...ఆ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు తెలిసింది. వేల సంఖ్యలో జనం మురికివాడల్లోనే తమ బ్రతుకు దెరువును వెళ్లదీస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికంలో పుట్టారు..పేదలుగానే మరణిస్తారు..వీళ్ల బతుకుల్లో భాగ్య రేఖలు ఎప్పుడో చెప్పడం కష్టం..! 

ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీల నిర్మాణానికి ఎంపిక చేశారు. వీటితోపాటు మరో 31 నగర పాలక సంస్థలు కూడా ఈ పథకానికి అర్హత సాధించాయ్. విశాఖ పట్నాన్ని అమెరికా సాయంతో  స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సాధించింది. విజయవాడ ఇప్పటికే కార్పొరేషన్...ఏపీ నూతన రాజధానికి మెయిన్ సెంటర్..! మొదటి దశలో అర్హత సాధించిన ఈ నగరాలు రెండో దశ పరీక్షలో ఎంత వరకు నిలబడతాయనేది ప్రశ్నగా ఉంది.

రెండో దశ అర్హతలో భాగంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కార్పొరేషన్లు ఆయా ప్రాంతాల వారిగా స్మార్ట్ సిటీ ప్లాన్స్ ను సమర్పించాల్సివుంటుంది. ఈ ప్రణాళికలను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నియమించే ఉన్నతస్థాయి కమిటీ నిశితంగా పరిశీలిస్తుంది. స్మార్ట్‌ సిటీ ప్రణాళికల్లో భాగంగా... నగర స్థాయి ప్రమాణాలకు 30 పాయింట్లు, ప్రతిపాదనల స్థాయి ప్రమాణాలకు 70 పాయింట్లు కేటాయిస్తారు. భవన నిర్మాణాలకు సగటున ఎన్ని రోజుల్లో అనుమతులు జారీ చేస్తున్నారు? ఆస్తి పన్ను మదింపు, పెంపు ఎలా ఉంది? విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌, ఐటీ సేవల వినియోగం వంటి అంశాలను ‘నగరస్థాయి ప్రమాణాల్లో’ భాగంగా పరిశీలిస్తారు. రెండు దశల పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 20 నగరాలను వెంటనే స్మార్ట్‌ సిటీలుగా ప్రకటిస్తారు. వాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు సమకూర్చుతారు. మిగిలిన నగరాలకు సంబంధించి తాము గుర్తించిన లోపాలు, వాటిని సరిదిద్దుకునే అవకాశాల గురించి అపెక్స్‌ కమిటీ వివరిస్తుంది. తదుపరి రెండు విడతల్లో జరిగే పోటీలో పాల్గొనేందుకు వీటికి అవకాశం లభిస్తుంది. మరి మన తెలుగు నగరాలు ఈ పోటీలో ఎంత వరకు రాణిస్తాయో వేచి చూడాలి! 

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...