కాంగ్రెస్ పార్టీలో కష్టాల్లో ఉన్న సమయంలో శ్రమించి పని చేసిన నాయకుడు డీ శ్రీనివాస్. పార్టీలో ప్రాంతాలు, కులాలు, వర్గాలు అన్న తేడా లేకుండా..
ఆందరితోనూ గౌరవింపబడే నేతగా పేరుతెచ్చుకున్నారు. ఇటు అధిష్టానానికి నమ్మినబంటూగా ఉన్నారు. ఐతే పార్టీలైన్ ఇంచ్ కూడా దాటని నేతగా పేరుపొందిన డీఎస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై మండిపడుతున్నారట. దిగ్వీజయ్ సింగ్ పేరెత్తితే చాలు..ఆగ్రహంతో ఊగిపోతున్నారని సమాచారం. పార్టీలైన్ తూచా తప్పక పాటిస్తూ..ఇతరులకు అదే విషయాన్ని పదే పదే చెప్పే శీనన్న.. అవన్ని మరిచి.. డిగ్గీరాజపై ఓంటీకాలుపై లేస్తున్నారట. దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమని ఆయన సన్నిహతులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ కు వచ్చిన ఒక్క ఎమ్మెల్సీ సీటు పై డీఎస్ కోటీ ఆశలు పెట్టుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి తాను పోటీచేయలేనని..తాను మూడు దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలను అధినేత్రి ముందుంచి.. రెన్యూవల్ కోసం అర్జీలు పెట్టుకున్నారు డీఎస్. డీఎస్ విధేయత సీనియర్ ఇలా అన్నీ అంశాలను గుర్తించి.. సోనియా కూడా డీఎస్కు టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందట.. దీంతో పదవి కన్ఫాం అని ఖుషీగా ఉన్న డీఎస్ ఆశలపై..ఆకులలలిత రూపంలో అధిష్టానం నీళ్లు జల్లింది. ఐతే దీనంతటికీ కారణం దిగ్విజయ్ సింగే అని డీఎస్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.