ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి పనుల కోసం $1 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని
చైనా రాయబారి యావో తెలిపారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగుతున్న మహిళా ప్రారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న ఆయన చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యావో మాట్లాడుతూ... చైనా పాకిస్థాన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందానికి అక్టోబర్ నాటికి తుదిరూపు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత దాదాపు 90 శాతం పాకిస్థాన్ ఎగుమతులపై అన్ని సుంకాల విధింపులు తొలగిపోతాయన్నారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటు తగ్గి, పాకిస్థాన్ ఎగుమతులు $500 మిలియన్ చేరుకుంటుందని తెలిపారు.