హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జింబాబ్వే మీడియా అధికారికంగా ప్రకటించింది. కాగా... ముగాబే 1980 నుంచి 2017 వరకు 37 ఏళ్లు జింబాబ్వే కు అధ్యక్షునిగా కొనసాగారు. అనంతరం 2017 నవంబర్ 21వ తేదీన ఆర్మీ తిరుగుబాటు చేసి ఆయన నుంచి అధికార పగ్గాలను కైవసం చేసుకుంది. అప్పట్లో ముగాబే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. రాజీనామా చేసే సమయానికి 93 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న దేశాధ్యక్షుడిగా ముగాబె రికార్డు సృష్టించారు.