వ్లాడివొస్టోక్: రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వ్లాడివొస్టోక్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమ దేశానికి వచ్చిన భారత ప్రధానికి
అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి జ్వెజ్డా నౌకలో ప్రయాణిస్తూ... పలు కీలక అంశాలు చర్చించారు. కాగా... ఈ రెండు రోజుల పర్యటనలో మోడీ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. దీంతో పాటు భారత్ - రష్యా 20వ ఆర్థిక సదస్సులో కూడా ఆయన పాల్గొబ్నానున్నారు. అయితే... వ్లాడివొస్టోక్ నగరంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు.