ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ మరోసారి విషం గక్కింది. భారత రాజ్యాంగంలో మార్పుల ద్వారా కశ్మీర్లో తీవ్రవాదం పెరిగితే అందుకు
పాకిస్థాన్ బాధ్యత వహించదని ఆ దేశ అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లోని అమెరికా - కెనడాలకు చెందిన ‘వైస్ న్యూస్’ జర్నలిస్టుతో ఆయన మాట్లాడుతూ... ఒక వేళ భారత్ యుద్ధానికి సిద్ధమైతే, దాన్ని ఎదుర్కోవడం తమ హక్కన్నారు. పుల్వామా లాంటి దాడుల సాకుతో భారత్ ఎప్పుడైనా పాకిస్థాన్‌పై దాడికి యత్నించవచ్చు కానీ... మేము మాత్రం యుద్ధం చేయబోమన్నారు. భద్రతామండలిలో కశ్మీర్ అంశంపై చేసిన తీర్మానాలను భారత్ కొట్టిపడేసిందని ఆయన ఆరోపించారు. కశ్మీర్ అంశంలో భారత్ నిప్పుతో చెలగాటమాడుతోందంటూ అల్వి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి మోడీ సర్కార్ మూర్ఖుల స్వర్గంలో విహరిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.