Print
Hits: 906

'' కేన్స్ ఫిలిం ఫెస్టివల్ '' ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చలన చిత్రోత్సవ వేడుకగా చెప్పుకుంటుంటారు. ఈ ఫిలిం ఫెస్టివల్

మంగళవారం సాయంత్రం (ఫ్రాన్స్ కాలమానం ప్రకారం) ఫ్రాన్స్ లోని ఫ్రెంచ్ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్ ప్రాంతంలో అట్టహాసంగా ప్రారంభమైంది. 72వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకకు ప్రముఖ మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షత వహిస్తుండగా, ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఎడ్వర్డ్ బాయర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. 11 రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఆర్టిస్ట్ లు పాల్గొననున్నారు. వివిధ బాషల చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు రెడ్ కార్పెట్ పై సందడి చేయనున్నారు. కేన్స్ వేడుక ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభం కాగా...,ఎల్లే ఫాన్నింగ్‌, టిల్డా స్విన్టన్‌, సెలెనా గోమెజ్‌, ఎవా లొంగొరియా, జులియానా మూరే త‌దిత‌రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుక‌కి ఇండియ‌న్ సెల‌బ్రిటీలు దీపికా ప‌దుకొణే, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, సోన‌మ్ క‌పూర్, కంగ‌నా ర‌నౌత్‌, డైనా పెంటి, మ‌ల్లికా షెరావత్, హీనా ఖాన్ త‌దిత‌రులు హాజ‌రై రెడ్ కార్పెట్ పై రంగురంగుల దుస్తుల్లో మెరవనున్నారు.

e-max.it: your social media marketing partner