ఫ్లోరిడా: అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 136 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి
వెళితే... క్యూబా నుంచి అమెరికా వస్తున్న... మియామి ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 విమానం, ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే విమానాశ్రయంలో ల్యాండవుతుండగా అదుపుతప్పి సెయింట్ జాన్స్ నదిలో పడిపోయింది. విమానం నదిలోకి పూర్తిగా మునగకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నావికాదళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ వారిని విమానం నుంచి బయటకు తీస్తున్నారు. మరోవైపు విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.