ప్రధాని పెళ్లికి సిద్ధమవుతోంది. న్యూజిల్యాండ్ ప్రధాని
జెసిండా ఆర్డర్న్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఆమె చిరకాల స్నేహితుడైన క్లార్క్ గే ఫోర్డ్ తో గత నెలలోనే ఆమె నిశ్చితార్థం జరిగినట్లు జెసిండా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఈస్టర్ సెలవుల్లో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందట. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె వేలికున్న నిశ్చితార్థపు ఉంగరం అందరి కంట పడటంతో అసలు విషయం బహిర్గతమయింది. కాగా..ఇప్పటికే వీరిద్దరికీ 10 నెలల పాప నీవి గేఫోర్డ్ కూడా ఉంది. అయితే ప్రధాని బాధ్యతల్లో ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన రెండో నాయకురాలిగా జెసిండా రికార్డుకెక్కారు. అంతకుముందు బెనజీర్ భుట్టో ఈ ఘనతను దక్కించుకున్నారు. కాగా..ఆర్డర్న్ భర్త గేఫోర్డ్ ఓ టీవీ షో ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. పాప బాధ్యతలను కూడా పూర్తిగా అతనే చూసుకుంటున్నాడు. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది వచ్చేవారం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.