Print
Hits: 1093

మూడు కళ్లున్న అరుదైన సరీసృపం ఉత్తర ఆస్ర్టేలియాలోని ఓ జాతీయ రహదారిపై

అటవీ అధికారులు గుర్తించారు. హంప్టీ డూ ప్రాంతంలో ఈ సర్పాన్ని గుర్తించిన కొద్దిరోజులకే మృతి చెందిందని అధికారులు తెలిపారు. సుమారు 40 సెంటీమీటర్ల పొడవున్న ఈ పామును ముద్దుగా ''మాంటీ పైతాన్'' అని పిలుపుచుకున్నామని పేర్కొన్నారు. ఏదో శారీరక సమస్యతో బాధపడుతూ ఈ సరీసృపం ఆహారం తీసుకోలేకపోయిందని వివరించారు. ఈ పాముకు మూడో కన్ను తలపై భాగంలో ఉందని, పుట్టుకతోనే ఇది ఏర్పడిందని వైద్య నిపుణులు వెల్లడించారు. 

e-max.it: your social media marketing partner