హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో
భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది. స్వల్ప భూ ప్రకంపనలతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. మండికి ఈశాన్యంలో 10 కిలోటమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు సిమ్లా వాతావరణ కేంద్ర డైరెక్టర్ మన్మోహన్ సింఘ్ పేర్కొన్నారు. మండి సహా హిమాచల్ ప్రదేశ్లోని అధికభాగం భూకంప తీవ్రతగల జోన్లో ఉండటం వల్లే తరచూ భూ ప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.