అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్
అధిక పన్నులు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ దేశ కాగిత ఉత్పత్తులు సహా, హార్లీ డేవిడ్‌సన్ వంటి బైక్‌లపై భారత్, చైనా, జపాన్‌లాంటి దేశాలు అధిక పన్నులు వేయడం వల్ల అమెరికాకు లక్షల డాలర్లు నష్టం వస్తోందంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్కాన్‌సిన్ స్టేట్‌లోని గ్రీన్‌బే సిటీలో జరిగిన రిపబ్లికన్ పొలిటికల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఇలా ప్రసంగించారు.
పన్నులు విధించడంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటోందని, వాళ్లు వేసే పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆరోపించారు. ‘భారత్, చైనా, జపాన్ దేశాల వల్ల దశాబ్దాలుగా మనం లక్షల డాలర్లను కోల్పోతున్నామన్నారు. దేశమేదైతేనేమి, చివరకు నష్టపోవాల్సి వస్తోంది మనమేనని అన్నారు. ఇప్పటివరకూ పోగొట్టుకున్నది చాలు...ఇక మీదట అలా జరగకుండా జాగ్రత్త పడదామని ట్రంప్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.