అప్పటి వరకూ క్యాట్ వాక్ చేస్తూ చురుగ్గా ఉన్న ఓ మోడల్ అర్థంతరంగా తనువు చాలించిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. బ్రెజిల్ లోని సౌ పౌలో
నగరంలో నిర్వహిస్తున్న ఫ్యాషన్ వీక్ ఆఖరి రోజున బ్రెజిల్ కు చెందిన మోడల్ టేల్స్ సోర్స్ స్టేజిలో హొయలొలికిస్తూ క్యాట్ వాక్ చేస్తోంది. ర్యాంప్ చివరి వరకూ బాగానే వచ్చిన ఆమె తిరిగి వెళ్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. వెంటనే నిర్వాహకులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా..26 ఏళ్ల మోడల్ టేల్స్ సోర్స్ అప్పటి వరకూ చురుగ్గానే ఉందని, ఉన్నట్లుండి ఆమె కుప్పకూలిపోవడం, ఆ వెంటనే ఆమె చనిపోయిందన్న వార్త తెలుసుకున్న తోటి మోడల్స్ నిర్ఘాంతపోయారు. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని నిర్వాహకులు చెప్పారు.