శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ నెల 21 ఆదివారం ఈస్టర్ రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ
ఆ దేశ రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అందజేసినట్లు ఓ అధికారులు తెలిపారు. ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆత్మాహుతి దాడులు, బాంబ్ బ్లాస్ట్ లు జరిగి 259 మంది మృతి చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఫెర్నాండో రాజీనామా చేసినట్లు అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు.