ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని మారణకాండ ఇది. ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన విషాద ఘటన ఇది. ఐసిస్ ఉగ్రమూక సృష్టించిన
ఈ మారణకాండలో మృతుల సంఖ్య ఇప్పటి వరకూ 359కి చేరింది. ఇంకా వందలాదిమంది చావుబతుకులతో పోరాడుతున్నారు. అయినప్పటికీ అక్కడ బాంబు పేలుళ్లు ఏ మాత్రం ఆగలేదు. ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నా..రోజుకొక ప్రాంతంలో పేలుడు జరుగుతూనే ఉంది. బుధవారం ఓ సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలింది. తాజాగా...పగోడలోని మెజిస్ర్టేట్ కోర్టుకు సంబంధించిన ఖాళీ ప్రదేశంలో బాంబు పేలింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శ్రీలంకలోని అన్ని క్యాథలిక్ చర్చిలను మూసివేసి, అన్నిరకాల సేవలను నిలిపివేస్తున్నట్లు సీనియర్ మతబోధకుడు ఒకరు మీడియాకు తెలిపారు. రక్షణ శాఖ సూచనల మేరకు దేశంలోని అన్ని క్యాథలిక్ చర్చిలు మూసివేయాలని నిర్ణయించుకున్నాం. మేం చెప్పేంత వరకు చర్చిల పరిసర ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని ఆయన పేర్కొన్నారు.