ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం, ఈస్టర్ పర్వదినం రోజున ఉగ్రమూక సృష్టించిన మారణకాండతో కొలంబోతో పాటు
శ్రీలంక మొత్తం ఉలిక్కిపడింది. వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన కొలంబోలో సోమవారం కూడా మరో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. తాజాగా బుధవారం ఏకంగా సినిమా థియేటర్ లక్ష్యంగా ఓ పేలుడు జరిగింది.స్థానిక సావోయ్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బైక్ లో ముష్కరులు బాంబు పెట్టారని గ్రహించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నిస్తున్న తరుణంలోనే అది ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో అక్కడ పెద్దగా జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.