కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై... ఆ దేశ రక్షణ శాఖ మంత్రి రువాన్ విజవర్దనే సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌లోని మసీదుల్లో
జరిగిన మారణకాండకు ప్రతీకరంగానే శ్రీలంకలో ఈ పేలుళ్లు జరిగినట్లు ఆయన తెలిపారు. ఈరోజు శ్రీలంక పార్లమెంట్లో బాంబు పేలుళ్ల ఘటనపై విజవర్దనే మాట్లాడుతూ... న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు. అయితే తమ దేశ రక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. దేశంలో అన్ని ఉగ్ర సంస్థలను రూపుమాపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే... ఆదివారం ఈస్టర్ పూట దేశ రాజధానిలో జరిగిన వరుస పేలుళ్లలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 330కి చేరింది. అందులో 45 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది.