ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సమీపంలోని కేంద్రంలో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా
నమోదైంది. భూకంపం ధాటికి ఓ భవనం కూలిపోయి ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.