శ్రీలంక దేశ రాజధాని కొలంబోలో తాజాగా మరో పేలుడు సంభవించింది. ఉదయం నుంచి వరుసగా జరిగిన
ఆరు పేలుళ్లతో కొలంబో ఉలిక్కిపడింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే కొలంబో సమీపంలోని దేహివెలాలో మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ పేలుడులో మరో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 160కి చేరగా.. 500 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొలంబోలో ఉగ్రదాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ 10 రోజుల క్రితమే అక్కడి ప్రభుత్వానికి సమాచారమిచ్చినా ఎటువంటి జాగ్రత్తలు పాటించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.