హైదరాబాద్: స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని ఆసియాలోని బ్రూనై దేశం కొత్త ఇస్లామిక్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దాంతో పాటు దొంగతనానికి పాల్పడిన
వ్యక్తులకు కూడా భారీ శిక్ష విధించాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ చట్టం ఈరోజు నుంచే అమలులోకి రానున్నట్లు బ్రూనై తెలిపింది. ఈ నిర్ణయంతో బ్రూనై తీరు పట్ల ప్రపంచదేశాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశమైన బ్రూనైలో ప్రస్తుతం సుల్తాన్ల పాలన కొనసాగుతున్నది. ఇస్లామిక్ మత ఆచారాలను, నియమాలను బలంగా అమలు చేయాలని ఇటీవల సుల్తాన్ హసనల్ బోల్కియా తెలిపారు. అయితే, బ్రూనైలోని 'గే' వర్గీయులు సుల్తాన్ ఆదేశాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు.