బంగ్లా కుర్ర బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
అరంగేట్రం సిరీస్ లో 13 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. మొదటి వన్డేలో ఐదు, రెండో వన్డేలో ఆరు, మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ మొత్తం 13 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. అరంగేట్రం సిరీస్ లోనే అదరగొట్టిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ చరిత్ర సృష్టించాడు. భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో వన్డే ఇంటర్నేషనల్లో అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్ తొలి సిరీస్ లోనే సత్తాచాటాడు. ద్వైపాక్షిక టోర్నీలో ఒక బౌలర్ 13 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. 2010లో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా బౌలర్ ర్యాన్ హ్యారీస్ కూడా 13 వికెట్లు తీశాడు. అయితే అది ఐదు మ్యాచుల సిరీస్.