భారత్ పై బంగ్లాదశ్ ఘనవిజయం సాధించింది.
వరుసగా రెండో వన్డేలోనూ గెలుపొందిన బంగ్లా వన్డే సిరీస్ ను దక్కించుకుంది. బంగ్లా యువ పేసర్ ముస్తాఫిజర్ భారత్ ను మరోసారి దెబ్బతీశాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని 38 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి బంగ్లా అవలీలగా ఛేదించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.