రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో రాణించిన ఓపెనర్ మయాంక్ 10 పరుగులకే
వెనుదిరుగగా, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. కాగా.. భారత్ 27 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులతో ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడా ఆదిలోనే షాకిచ్చాడు. మొదటి రెండు వికెట్లనే పడగొట్టి సౌతాఫ్రికా శుభారంభం ఇచ్చాడు. రెండో టెస్టులో డబల్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి(12)ని ఎన్రిచ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(43), రహానే (32) ఉన్నారు.